తెలంగాణ, కొమరం భీమ్ ఆసిఫాబాద్. 4 జూలై (హి.స.)
ప్రభుత్వాలు ఎన్ని మారినా మా
బతుకులు మారడం లేదని ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని గ్రామ ప్రజలు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఏటా వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, కనీసం అంబులెన్సు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. వర్షాకాలం వస్తే పాముకాటు వేసిన, ఆసుపత్రికి చేరకుండానే ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో జరిగాయన్నారు.
గర్భిణీల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎడ్ల బండిలో డోలికట్టి బెజ్జురు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. అడవి మధ్యలో రెండులో లెవెల్ ఒర్రెలు ఉండటం, వలన చిన్నపాటి వర్షానికే ఉప్పొంగి చుట్టు పక్క గ్రామాలతో సంబంధం తెగి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉందన్నార. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు