లకిడీకాపూల్లో రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ఖ‌ర్గే..
హైదరాబాద్, 4 జూలై (హి.స.) ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌మిళనాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా కాంస్య విగ్ర‌హాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ
రోశయ్య జయంతి


హైదరాబాద్, 4 జూలై (హి.స.)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, త‌మిళనాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా కాంస్య విగ్ర‌హాన్ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ మరియు రోశ‌య్య కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. లక్డీకాపూల్ లోని మెట్రో స్టేషన్‌ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో రోశయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు..

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16సార్లు ఆర్థికశాఖ మంత్రి హోదాలో రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప‌ద‌వుల‌కే రోశయ్య వ‌న్నే తీసుకు వ‌చ్చార‌న్నారు.

చేసిందని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో నిష్ట, నిబద్ధతకు రోశయ్య ఓ ఉదాహరణ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల పట్ల ఆయన చూపిన సేవా దృక్పథం అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande