హైదరాబాద్, 4 జూలై (హి.స.)
సీలింగ్ చట్టం 1973ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిల్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. గరిష్ట భూ పరిమితి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ లో కోరారు. దీనిపై సీజే ధర్మాసనం.. సీఎస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎస్ఏ, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్