రూ. 1 లక్ష కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్.
దిల్లీ:, 4 జూలై (హి.స.)రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ
రూ. 1 లక్ష కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్.


దిల్లీ:, 4 జూలై (హి.స.)రూ. 1 లక్ష కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) అనుమతి ఇచ్చింది. మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు సహా సైనిక హార్డ్‌వేర్ కొనుగోలు చేయడానికి 10 ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ ఆమోదం తెలిపింది. ‘‘ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, త్రివిధ దళాల కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణుల సేకరణకు DAC తన అవసరాన్ని అంగీకరించింది. ఈ కొనుగోళ్లు సైన్యం వేగవంతమైన మోహరింపు, సమర్థవంతమైన వాయు రక్షణ, మెరుగైన సరఫరా గొలుసు నిర్వహణను అందిస్తాయి. సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచుతాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande