ఢీల్లీ, 4 జూలై (హి.స.)రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రం భారీ వర్షాలు(Heavy rains), ఆకస్మిక వరదల(Floods)తో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక, వరదలతో రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అంతేకాదు పలుచోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి.
ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి వారం రోజుల వ్యవధిలో 37 మంది మృతి చెందగా, 40 మంది గల్లంతయ్యారు. మొత్తం రూ.400 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. ఈ నష్టం మరింత పెరగవచ్చని తెలిపింది. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి ఆహార పొట్లాలు అందిస్తున్నట్లు అక్కడి అధికారులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి