స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. 2 గంటలుగా ప్రయాణికుల పడిగాపులు
చెన్నై , 4 జూలై (హి.స.)అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Airindia Crash Incident) ఘటన తర్వాత.. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. తరచూ విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. 2 గంటలుగా ప్రయాణికుల పడిగాపులు


చెన్నై , 4 జూలై (హి.స.)అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాద (Ahmedabad Airindia Crash Incident) ఘటన తర్వాత.. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. తరచూ విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్ (Chennai to Hyderabad) రావలసిన స్పైస్ జెట్ విమానంలో (Spice Jet) సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్.. తిరిగి చెన్నైలోనే ల్యాండ్ చేశారు. దాదాపు 2 గంటలుగా ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరగా.. వేచి ఉండాలని చెబుతుండటంతో అసహనం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande