ఈ నెల.10.న రాష్ట్రవ్యాప్తంగా మెగా.పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు
అమరావతి, 5 జూలై (హి.స)ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ సమావేశాలు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప
ఈ నెల.10.న రాష్ట్రవ్యాప్తంగా మెగా.పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు


అమరావతి, 5 జూలై (హి.స)ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ సమావేశాలు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ పర్యావరణంపై అవగాహన కల్పించేలా పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలను పరిరక్షించేలా చూసి విద్యార్థులకు గ్రీన్‌ పాస్‌పోర్టులు అందించాలన్నారు. రాష్ర్టానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు, భవిత సెంటర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని మారుమూల పాఠశాలలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ అందేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. గిరిజన విద్యార్థులు బడులకు వెళ్లే దారులపై అధ్యయనం చేయాలని, అవసరమైన చోట్ల నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు నాటికి మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందించేలా చర్యలు చేపట్టాలని లోకేశ్‌ ఆదేశించారు. హైస్కూల్‌ ప్లస్‌లలో అధ్యాపకులను నియమించాలని, షెడ్యూలు ప్రకారం అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తిచేసి అడ్మిషన్లు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన యాజమాన్యాలతో చర్చించాలని, వర్సిటీల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande