దిల్లీ, 5 జూలై (హి.స.)
, - , : ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా తెలుగు మహిళ రేవతి మన్నెపల్లిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రేవతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేట. ‘స్వగ్రామంలో తొలి ఇంజినీర్ అయిన ఆమె అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డుకు నాయకత్వం వహించే పదవికి భారత్ తరఫున నామినేట్ అయ్యే స్థాయికి ఎదిగారు. ఆమెది ప్రపంచస్థాయిలో ప్రభావం చూపే అద్భుతమైన ప్రయాణం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ