హైదరాబాద్, 5 జూలై (హి.స.)
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి నేటి ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 2వ తేదీన ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు.అయితే జ్వరం తగ్గడంతో నిన్న చాలా హుషారుగా బీఆర్ఎస్ నేతల తో ఆయన చిట్ చాట్ చేశారు. ప్రస్తుతం షుగర్, సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్ లోకి వచ్చాయని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో యశోద ఆస్పత్రి నుండి కేసీఆర్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన నందినగర్ నివాసానికి బయల్దేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సంతోష్ కుమార్ లు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్