స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి .. ఆళ్లగడ్డలో విషాదం
నంద్యాల, 5 జూలై (హి.స.)నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఐయిదేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ (5) ఓ ప్రైవేటు పాఠశాలలో ఎ
స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి .. ఆళ్లగడ్డలో విషాదం


నంద్యాల, 5 జూలై (హి.స.)నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఐయిదేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..

ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్‌కు చెందిన శ్రీధర్, వనజ దంపతుల కుమార్తె హరిప్రియ (5) ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. నిన్న చిన్నారి తొలిరోజు పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం పాఠశాల బస్సులో తిరిగి వచ్చిన ఆ చిన్నారి బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా, గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో చిన్నారి బస్సు టైర్ల కింద పడి ప్రాణాలు కోల్పోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande