అమరావతి, 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh) కేబినెట్ సమావేశానికి ముహుర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ నెల(జూలై) 9వ తేదీన జరగనుంది. ఈ సమావేశం(AP Cabinet Meeting)లో కీలక అంశాలపై చర్చించనున్నారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జూలై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ భేటీలో అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీలు ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు(శనివారం) సీఎం చంద్రబాబు(CM Chandrababu) పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఇంటింటికి టీడీపీ అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో పార్టీ నేతలు, అధికారులు, పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి