శ్రీశైలం, 6 జూలై (హి.స.)
సున్నిపెంట: జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ