గలేవో , 6 జూలై (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ (Brezil) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గలేవో అంతర్జాతీయ విమాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఈ పర్యటనలో భాగంగా మోడీ రియోలో జరిగే 17వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి మోడీ వివిధ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాని రాజధాని బ్రెసిలియా చేరుకుని, అక్కడ ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారం దృష్ట్యా ఈ సమావేశం కీలకంగా మారింది.
కాగా, మొదట బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికాలను కలిగి ఉన్న బ్రిక్స్ సమూహం. క్రమంగా ఈ సమూహం విస్తరించింది. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అత్యంత శక్తివంతమైన కూటమిలలో ఒకటిగా మారింది. ఇక ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఘనా, ట్రినిడాడ్-టొబాకో, అర్జెంటీనాలను సందర్శించారు. ఆయన తన పర్యటన చివరి దశలో నమీబియాను సందర్శిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి