టెక్సాస్‌లో వరద బీభత్సం... 69కి చేరిన మృతుల సంఖ్య
టెక్సాస్ , 7 జూలై (హి.స.) అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య 69కి చేరింది. చ‌నిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మర
టెక్సాస్‌లో వరద బీభత్సం... 69కి చేరిన మృతుల సంఖ్య


టెక్సాస్ , 7 జూలై (హి.స.)

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య 69కి చేరింది. చ‌నిపోయిన వారిలో 21 మంది చిన్నారులు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

అత్యధికంగా కెర్విల్లే కౌంటీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఒక్క కౌంటీలోనే 59 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 21 మంది చిన్నారులేనని షెరీఫ్ లారీ లీథా తెలిపారు. క్యాంప్ మిస్టిక్‌కు చెందిన 11 మంది విద్యార్థులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆయన వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కౌంటీలు వరదల ప్రభావానికి గురయ్యాయని అధికారులు తెలిపారు.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ మరో ఆరు కౌంటీలను కూడా విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శిథిలాలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు తక్షణమే స్పందించి విపత్తుగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. పేరుకుపోయిన శిథిలాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు. రానున్న 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande