పల్లెల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
తెలంగాణ, మంచిర్యాల. 8 జూలై (హి.స.) పల్లెల్లోని సమస్యలు తెలుసుకుని అంచెలంచెలుగా తీరుస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం గ్రామంలో పొద్దు పొడుపు- బొజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) కార్యక్రమం మంగళవారం ఉదయం
ఎమ్మెల్యే బొజ్జు పటేల్


తెలంగాణ, మంచిర్యాల. 8 జూలై (హి.స.)

పల్లెల్లోని సమస్యలు తెలుసుకుని అంచెలంచెలుగా తీరుస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం గ్రామంలో పొద్దు పొడుపు- బొజ్జన్న అడుగు (మార్నింగ్ వాక్) కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి పరిష్కరిస్తానన్నారు. పల్లెల అభివృద్దే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, గ్రామాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు,త్రాగు నీరు అందించేందుకు బోర్లు వేశామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చామని, పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande