హైదరాబాద్, 8 జూలై (హి.స.)
కేసీఆర్ కు చట్టసభలు అంటే గౌరవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. అందుకే అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్.. దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ ను తీసుకుని రావాలని లేకుంటే దద్దమ్మలా మిగిలిపోతావ్ అని ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ అసలు ని స్థాయి ఏంటి? నీకే స్థాయి లేదు నీకు మేమే ఎక్కువ. కేటీఆర్ ఇకనైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని తెలంగాణ ప్రజలు మిమ్మలని నమ్మే పరిస్థితులో లేరన్నారు. ప్రజలు కేసీఆర్ ను ప్రతిపక్షనాయకుడి బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పండుకున్నారని విమర్శించారు. మీ కుటుంబంలో తలెత్తిన సమస్యల వల్ల కేటీఆర్ ప్రస్టేషన్ ను రాష్ట్రం ఎందుకు భరించాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వాళ్ళు అసెంబ్లీ దొంగలు మీరు అని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..