తెలంగాణ, ములుగు. 8 జూలై (హి.స.)
తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు లో మంగళవారం నాడు మీడియాతో ఆమె మాట్లాడారు. వాస్తవ విషయాలు తీసుకుని బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో ప్రజాపాలన సాఫీగా జరుగుతుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిరసన పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీతక్కకు ఉన్న ప్రతిష్టతను దెబ్బతియ్యాలన్న దురుద్దేశంతో కేటీఆర్ తన దండును పంపి జిల్లాలో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు