గత ప్రభుత్వం నిర్లక్ష్యమే రైతులకు శాపం : మంత్రి జూపల్లి
తెలంగాణ, నాగర్ కర్నూల్. 8 జూలై (హి.స.) ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే సాగు నీటి విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిగా సాగు నీటిని రైతులకు అందించేంద
మంత్రి జూపల్లి


తెలంగాణ, నాగర్ కర్నూల్. 8 జూలై (హి.స.)

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే

సాగు నీటి విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిగా సాగు నీటిని రైతులకు అందించేందుకు గాను కొన్ని సలహాలు, సూచనలు చేసిన నాడు మంత్రి హరీష్ రావు విస్మరించారని మంత్రి ఆరోపించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో నిర్మించిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. ఎంజీకేఎస్ఐ మోటర్ల ను స్పీచ్ యార్డులో కంప్యూటర్ ద్వారా ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. నీటి డెలివరీ పాయింట్ (సిస్టర్న్ ) మోటర్ల దగ్గర వారు గంగమ్మకు పూజలు చేసి పూలు చల్లారు. అనంతరం పాలమూరు_రంగారెడ్డి ప్రాజెక్టు కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి జిల్లా ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande