సోలార్ పవర్ ప్లాంట్ మాకొద్దు.. రాఘవపూర్ గ్రామస్థుల ఆందోళన
తెలంగాణ, పెద్దపల్లి 8 జూలై (హి.స.) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో అప్పన్నపేట సహకార సొసైటీ ఆధ్వర్యంలో పీఎం కుసుం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సర్వే నం 1072 లో 4 ఎకరాల భూమి కేటాయించి జిల్లా కలెక్టర్ ఆర్డర్ జ
గ్రామస్తుల ఆందోళన


తెలంగాణ, పెద్దపల్లి 8 జూలై (హి.స.) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో అప్పన్నపేట సహకార సొసైటీ ఆధ్వర్యంలో పీఎం కుసుం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సర్వే నం 1072 లో 4 ఎకరాల భూమి కేటాయించి జిల్లా కలెక్టర్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఆ స్థలాన్ని ఏళ్ల నాటి నుండి స్మశాన వాటికగా వాడుకుంటున్నామని, అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తమ పెద్దల ఆనవాళ్లు పోతాయని, కనుక ఆ సోలార్ పవర్ ప్లాంట్ మాకు వద్దని మంగళవారం గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ చూపి సోలార్ పవర్ ప్లాంట్ ను వేరే స్థలంకు మార్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande