సైలెన్సర్ మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు : వరంగల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ
తెలంగాణ, వరంగల్. 8 జూలై (హి.స.) ద్విచక్ర వాహనాలలో అధిక శబ్దం చేస్తే మారిన సైలెన్సర్ల పై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంపెనీతో వచ్చిన అసలైన సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనదారులపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్న
వరంగల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ


తెలంగాణ, వరంగల్. 8 జూలై (హి.స.)

ద్విచక్ర వాహనాలలో అధిక శబ్దం చేస్తే మారిన సైలెన్సర్ల పై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంపెనీతో వచ్చిన అసలైన సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనదారులపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం కేయూసీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గత మూడు నెలలుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో గుర్తించిన 311 మారిన సైలెన్సర్లను రోడ్ రోలర్తో నాశనం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ట్రాఫిక్ ఏసీపీ.. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్ మార్పు చేయడం చట్టరీత్యా నేరం. శబ్ద కాలుష్యం, ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి వాహనదారులకు కౌన్సిలింగ్తో పాటు రూ. 1000 జరిమానా విధిస్తున్నామన్నారు. సైలెన్సర్ మార్పు చేసినవారి డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల పాటు ఆర్టీఏ రద్దు చేస్తుంది. సంబంధిత వాహనాలను సీజ్ చేస్తారు. మార్పు చేసిన మెకానిక్ల పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి అని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande