అమరావతి, 9 జూలై (హి.స.),:మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న మరో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సిట్ పోలీసులు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను వినడానికి విచారణను న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారానికి వాయిదా వేశారు. కాగా, బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో ల్యాప్‌టా్‌పలు, హార్డ్‌డి్‌స్కలు స్వాధీనం చేసుకున్నామని సిట్ పోలీసులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. మంగళవారం ఈ మెమోను న్యాయాధికారి పి.భాస్కరరావుకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ