దిల్లీ- వాషింగ్టన్‌ విమాన సర్వీసులు నిలిపివేత
దిల్లీ:12 ఆగస్టు (హి.స.)దిల్లీ- వాషింగ్టన్‌ డీసీ మధ్య నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 26 బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలకు నవీకరణ చేపడు
AIR INDIA


దిల్లీ:12 ఆగస్టు (హి.స.)దిల్లీ- వాషింగ్టన్‌ డీసీ మధ్య నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 26 బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలకు నవీకరణ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, పాకిస్థాన్‌ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. సెప్టెంబర్‌ 1 తర్వాత వాషింగ్టన్‌ డీసీకి లేదా అక్కడి నుంచి దిల్లీకి టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికుల్ని సంప్రదించి.. వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్‌ లేదా పూర్తి రిఫండ్‌ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను సైతం అందిస్తామని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande