న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.)
బెట్టింగ్ యాప్ ప్రమోషన్, మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో మాజీ క్రికెటర్ సురేష్ రైనా బుధవారం ఈడీ ఆఫీస్ కు హాజరయ్యాడు. కేసులో రైనా స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు నేడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రైనా వచ్చాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రైనా వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ చట్టాలను ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి.. కొట్లలో డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్