న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.)
హత్య కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్
పై ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో తాత్కలిక బెయిల్ పై సుశీల్ కుమార్ జైలు నుంచి బయటకు రాగా హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణలు పూర్తవ్వగా.. సుశీల్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారం రోజుల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో 27 ఏళ్ల మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ ను సుశీల్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సుశీల్ కుమార్ సాక్షులను బెదిరించడంపై ఆరోపణలు లేవనెత్తుతూ బెయిల్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం కోర్టు బెయిల్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..