గుజరాత్ వ్యక్తులకు బిహార్‌లో ఓటర్ కార్డులా..? తేజస్వీ ఆరోపణలు
న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.)బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను నిర్వహించిన సంగతి తెలిసిందే (Bihar Politics). ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్క
Thrissur Loksabha Election


న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.)బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను నిర్వహించిన సంగతి తెలిసిందే (Bihar Politics). ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఎన్నికల సంఘం (Election Commission) ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. దాంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బిహార్‌లో ఓటర్లుగా మారుతున్నారని తాజాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వ్యాఖ్యలు చేశారు.

‘‘గుజరాత్‌కు చెందిన కొందరు వ్యక్తులు బిహార్‌లో ఓటు హక్కు పొందుతున్నారు. భాజపా ఇంఛార్జి భిఖుభాయ్‌ దల్సానియా పట్నా ఓటర్‌గా మారారు. 2024లో ఆయన గుజరాత్‌లో ఓటువేశారు. అక్కడ ఆయన పేరు తొలగించారు. బిహార్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఎక్కడికి వెళ్తారు. ఇదంతా ఒక కుట్ర. ఎన్నికల కమిషన్‌తో కలిసి భాజపా మోసం చేస్తోంది’’ అని తేజస్వి తీవ్ర విమర్శలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande