2030 కామన్వెల్త్ గేమ్స్.. ఆతిథ్యం కోసం భారత్ అధికారిక బిడ్.. ఐఓఏ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దిశగా భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. ఈ మెగా క్రీడల నిర్వహణకు భారత్ దాఖలు చేయనున్న బిడ్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (
2030 కామన్వెల్త్ గేమ్స్.. ఆతిథ్యం కోసం భారత్ అధికారిక బిడ్.. ఐఓఏ గ్రీన్ సిగ్నల్


ఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.)

2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దిశగా భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. ఈ మెగా క్రీడల నిర్వహణకు భారత్ దాఖలు చేయనున్న బిడ్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్‌జీఎం) ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని ప్రధాన వేదికగా ప్రతిపాదిస్తూ ఈ బిడ్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఈ పోటీ నుంచి కెనడా వైదొలగడంతో 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను పొందేందుకు భారత్‌కు అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇప్పటికే ప్రాథమిక ఆసక్తిని వ్యక్తం చేసిన భారత్, తుది బిడ్ పత్రాలను ఆగస్టు 31 లోపు సమర్పించాల్సి ఉంది. ఈ క్రీడల నిర్వహణకు అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఐఓఏ స్పష్టం చేసింది.

ఈ సమావేశం అనంతరం ఐఓఏ జాయింట్ సెక్రటరీ కల్యాణ్ చౌబే మాట్లాడుతూ, జనరల్ హౌస్ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై మా సన్నాహాలను వేగవంతం చేస్తాం అని తెలిపారు. ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని బృందం అహ్మదాబాద్‌లోని క్రీడా వేదికలను పరిశీలించి, గుజరాత్ ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఈ నెలలోనే మరో పెద్ద ప్రతినిధి బృందం పర్యటించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande