ఆధార్, ఓటరు ఐడీ కార్డులతో భారత పౌరులు కాలేరు
ముంబయి::, 13 ఆగస్టు (హి.స.) ఓ వ్యక్తికి ఆధార్, పాన్, ఓటరు ఐడీ కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరుడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయుడికి బెయిల్‌ నిరాకరిస్తూ జస్టిస్‌ బోర్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశార
ఆధార్, ఓటరు ఐడీ కార్డులతో భారత పౌరులు కాలేరు


ముంబయి::, 13 ఆగస్టు (హి.స.) ఓ వ్యక్తికి ఆధార్, పాన్, ఓటరు ఐడీ కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరుడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయుడికి బెయిల్‌ నిరాకరిస్తూ జస్టిస్‌ బోర్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారమే దీనిని నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్, పాన్, ఓటరు ఐడీ కార్డులు ఆయా వ్యక్తుల గుర్తింపు లేదా సంబంధిత సేవలు పొందడం కోసం మాత్రమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు.

7

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande