ఆర్మీ పోస్ట్‌పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి
బారాముల్లా,, 13 ఆగస్టు (హి.స.) బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్ర
Indian Army


బారాముల్లా,, 13 ఆగస్టు (హి.స.)

బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్‌ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande