దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో
న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.) . అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మన సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 80,422 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు ఎగబాకి 24,568 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌త
Bombay Stock Exchange


న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.)

. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మన సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 80,422 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు ఎగబాకి 24,568 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.65 వద్ద ఉంది.

నిఫ్టీ సూచీలో అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్ స్టాక్స్‌ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు అదే బాటలో పయనిస్తున్నాయి. సుంకాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande