కంచ గచ్చిబౌలి కేసు: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ ఆదేశాలు
న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.) తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కంచ గచ్చిబౌలి కేసు విచారణలో సుప్రీంకోర్టు సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బుధవారం సుప్రీం
Supreme Court


న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.) తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కంచ గచ్చిబౌలి కేసు విచారణలో సుప్రీంకోర్టు సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమస్యకు సంతోషకరమైన ముగింపు పలకాలన్నారు. అలాగే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.

పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని, అప్పుడు తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని జస్టిస్ అన్నారు. పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీం సూచనల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు ఆరు వారాల సమయం కావాలని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande