దిల్లీ:న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.) అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ వివిధ పార్టీలు ఇచ్చిన నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయింది. నిబంధనల ప్రకారం ఈ అభియోగాలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఆయన నియమించారు. దీనిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బి.వి.ఆచార్య ఉన్నారు. 91 సంవత్సరాల ఆచార్య దాదాపు ఆరు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. కమిటీ వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తుందని, అది అందేవరకూ న్యాయమూర్తి తొలగింపు ప్రతిపాదన పెండింగ్‌లో ఉంటుందని ఓంబిర్లా ప్రకటించారు. జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని 146 మంది లోక్‌సభ సభ్యులు ప్రతిపాదన సమర్పించారని తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీ హైకోర్టులో సేవలందిస్తున్నప్పుడు అధికారిక నివాసంలో మార్చి 14న పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ