భారత్‌కు పాక్ ప్రధాని వార్నింగ్
న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.) ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్‌ డే సందర్భంగా భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్
Pakistan PM


న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.)

ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్‌ డే సందర్భంగా భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము సింధూ జలాల కోసం ఎంత వరకైనా పోరాడతామన్నారు. ఇండస్ నదీ జలాలను పాకిస్తాన్‌ జీవనరక్తం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పాక్ హక్కులపై ఏ విధమైన సడలింపులు ఉండవని షెహబాజ్‌ షరీఫ్‌ స్పష్టం చేశారు.

ఇక, సోమవారం నాడు భారత్‌ను సింధు జలాలు విడుదల చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. ఒప్పంద హక్కులను పూర్తిగా పాటించాలని కోరగా.. మరోవైపు, పాక్ మాజీమంత్రి బిలావల్‌ భుట్టో భారత్‌పై హాట్ కామెంట్స్ చేశారు. సింధూ జలాలను విడుదల చేయకపోతే యుద్ధం చెయ్యడం ఒక్కటే మార్గం అని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande