న్యూఢ్లిల్లీ:, 13 ఆగస్టు (హి.స.)
ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్ సందర్శించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు కనిపించాయి. అయితే ఈ మధ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరుకానున్నారు. న్యూయార్క్ వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా పలువురు నాయకులను మోడీ కలవనున్నారు. పర్యటనలో భాగంగా ట్రంప్‌తో కూడా మోడీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదం పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ