బెంగళూరు నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లు షిఫ్ట్?
బెంగళూరు, 13 ఆగస్టు (హి.స.)ఈ ఏడాది జరగబోయే మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో గువహతి, విశాఖపట్నం, ఇండోర్‌తోపాటు బెంగళూరు కూడా వేదికగా ఎంపికైంది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విక్టర
ై


బెంగళూరు, 13 ఆగస్టు (హి.స.)ఈ ఏడాది జరగబోయే మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో గువహతి, విశాఖపట్నం, ఇండోర్‌తోపాటు బెంగళూరు కూడా వేదికగా ఎంపికైంది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 11 మంది మరణించగా చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత పెద్ద మ్యాచ్‌లకు చిన్న స్వామి స్టేడియం సురక్షితం కాదని కర్ణాటక ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి మ్యాచ్‌లను మరో వేదికను మార్చాలని బీసీసీఐ, ఐసీసీ భావిస్తున్నాయి. తిరువనంతపురంను వేదికగా పరిగణిస్తున్నట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు జరగాలి. భారత్, శ్రీలంకల మధ్య సెప్టెంబర్ 30న ఓపెనింగ్ మ్యాచ్‌తోపాటు అక్టోబర్ 3న ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మ్యాచ్, 26న భారత్, బంగ్లాదేశ్ గేము, 30న రెండో సెమీస్ అక్కడ నిర్వహించాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ మ్యాచ్‌ను తిరువనంతపురం షిఫ్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో ప్రకటన రానుంది. మరోవైపు, క్రికెట్‌ మ్యాచ్‌లపై కర్ణాటక ప్రభుత్వం కఠిన వైఖరి నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande