తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
మంబై, 4 ఆగస్టు (హి.స.) అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు బంగారు అభరణాల మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ తులం
Gold


మంబై, 4 ఆగస్టు (హి.స.)

అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు బంగారు అభరణాల మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ తులం ధర లక్ష రూపాయలకుపైగానే ఉంది. దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వెండి ధర కూడా అందే అది కూడా అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. GST జోడించకుండానే బంగారం రూ. లక్ష దాటింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని, వెండి మరింత చౌకగా మారవచ్చని కొందరు అంటున్నప్పటికీ అదేమి తగ్గకుండా లక్షకుపైగానే దూసుకుపోతోంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,040 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande