వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
ముంబై, 6 ఆగస్టు (హి.స.) బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులకు లోవుతుంటుంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండు, మూడింతలు పెరుగుతుంది. గతంలో 90 వేల రూపాయల వరకు ఉన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. తగ్గినట్లే త
Gold


ముంబై, 6 ఆగస్టు (హి.స.)

బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులకు లోవుతుంటుంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండు, మూడింతలు పెరుగుతుంది. గతంలో 90 వేల రూపాయల వరకు ఉన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. తగ్గినట్లే తగ్గి భారీగా ఎగబాకుతోంది. తాజాగా ఆగస్టు 6వ తేదీన తులం బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై 900 రూపాయల వరకు పెరిగింది. గత రెండు రోజుల కిందటి ధరను చూస్తే తులంపై ఏకంగా 1500 రూపాయల వరకు పెరిగింది. ఇలా రెండు, మూడు రోజుల దరలను పరిశీలిస్తే తులంపై దాదాపు 3 వేల రూపాయలకుపైగానే పెరిగింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,0,2380 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,860 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02230, రూ.93,710 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02230, రూ.93,710 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02230, రూ.93,710 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande