ముంబై, 8 ఆగస్టు (హి.స.)
దేశంలో పసిడి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకుని మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 2025 ఉదయం 6:10 గంటల సమయానికి బంగారం ధరలు సరికొత్త స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,010కి చేరుకుంది.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి (gold and silver price on August 8th 2025). కిలో వెండి ధర రూ. 1,17,100 స్థాయిలో ఉంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొనసాగుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి (1 కిలో) రూ. 1,27,100.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710, 22 క్యారెట్ల బంగారం రూ. 94,160, వెండి రూ. 1,17,100.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,27,100.
ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,17,100.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,17,100.
బంగారం, వెండి ధరల ప్రధాన పెరుగుదలకు కారణాలు
ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల విక్రయాలు కొంత తగ్గాయి. చాలా మంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న ఆభరణాల షాపుల వ్యాపారం 20-25% తగ్గినట్లు వర్తకులు తెలిపారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ధరల పెరుగుదలను సానుకూలంగా చూస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి