చెన్నై: 8 ఆగస్టు (హి.స.)పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) అనే వటవృక్షాన్ని తన చెమటతో పెంచి పోషించానని, ప్రస్తుతం తన తనయుడే ఆ వృక్షాన్ని గొడ్డలతో నరికి ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr. Ramdas) ఆవేదన వ్యక్తం చేశారు. దిండివనం తైలాపురం గార్డెన్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్బుమణి తన నివాసానికి వచ్చినప్పుడల్లా తల్లిని మాత్రమే పరామర్శించి వెళ్తున్నాడన్నారు.
పార్టీలోని 34 విభాగాలకు చెందిన ప్రతినిధులను డబ్బుతో తన వెంట తిప్పుకుంటున్న అన్బుమణి వల్లే పార్టీలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ కారణంగానే యేళ్ల తరబడి తనను ‘అయ్యా...!’ అని వినమ్రంగా సంబోధించినవారంతా ప్రస్తుతం అందరూ తనను ‘రాందాస్’ అని పేరుపెట్టి పిలిచే స్థాయికి తెచ్చిన ఘనత అన్బుమణికే దక్కిందన్నారు. కుట్రలు కుతంత్రాలు పన్నుతూ పార్టీని హస్తగతం చేసుకోవాలని అన్బుమణి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ