రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతో తెలుసా?
ముంబై, 9 ఆగస్టు (హి.స.)బంగారం ధరలు వేగంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి ధరలను ఈ స్థాయికి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు బంగారం ధరలపై తీవ్
Gold


ముంబై, 9 ఆగస్టు (హి.స.)బంగారం ధరలు వేగంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి ధరలను ఈ స్థాయికి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భారతదేశం, స్విట్జర్లాండ్ నుండి దిగుమతులపై భారీ సుంకాలు విధించారు. ఇది ప్రపంచ వాణిజ్యంలో అస్థిరతను పెంచింది. ఈ సుంకాలు భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేశాయి. రూపాయి విలువ పడిపోయింది. బలహీనమైన రూపాయి బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తోంది. దేశీయ మార్కెట్లో దాని ధరలను పెంచుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆగస్ట్‌ 9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా 500 రూపాయలకుపైగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,03,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధరర 1,16,900 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.

చెన్నైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.

ముంబైలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,320 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.94,710 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande