భారత్‌, అమెరికా క్లోజ్‌ ఫ్రెండ్స్‌: మోదీ
న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.)భారత్‌- అమెరికాల మధ్య టారిఫ్‌ (US Tariffs) విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ట్రూత్‌ సోషల్‌ల
Trump- Modi


న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.)భారత్‌- అమెరికాల మధ్య టారిఫ్‌ (US Tariffs) విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుపై తాజాగా మోదీ (PM Modi) స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

‘భారత్‌- అమెరికా సన్నిహిత స్నేహితులు, మంచి భాగస్వాములు. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. ఈ చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు మా సభ్యులు కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటానికి నేను కూడా ఎదురుచూస్తున్నా. రెండు దేశాల్లోని ప్రజలకు సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేం కలిసి పనిచేస్తాం’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande