నేపాల్ ఆర్మీ చీఫ్.. ‘‘హిందూ రాజ్యం’’గా మారుతుందా..
న్యూ ఢిల్లీ, 10 సెప్టెంబర్ (హి.స.)నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేత్ దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో, ఆయన వెనక ‘‘హిందూ రాజు’’ పృథ్వీ నారాయణ్ షా చిత్రపటం ఉండటం అందరిలో ఆసక్తి పెంచింది. నేపాల్‌లో 239 ఏళ్ల ‘‘రాచరిక’’ పాలనకు 2008తో అంతమైంది
అశోక్ రాజ్ సిగ్దేత్


న్యూ ఢిల్లీ, 10 సెప్టెంబర్ (హి.స.)నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేత్ దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో, ఆయన వెనక ‘‘హిందూ రాజు’’ పృథ్వీ నారాయణ్ షా చిత్రపటం ఉండటం అందరిలో ఆసక్తి పెంచింది. నేపాల్‌లో 239 ఏళ్ల ‘‘రాచరిక’’ పాలనకు 2008తో అంతమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడింది. 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే, ఆ దేశంలో ఎంత అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఆ దేశంలో రాజు పాలన రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు.

తాజాగా, ఆర్మీ చీఫ్ వెనకాల ఈ ఫోటో ఉండటం చూస్తే, క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నేపాల్‌ రాజకీయాల్లో దీనిని ‘‘బిగ్ డెవలప్మెంట్’’గా నెటిజన్లు చెబుతున్నారు. దీనిని అతిపెద్ద ప్రకటనగా అభివర్ణిస్తున్నారు. అయితే, రాజు పృథ్వీ నారాయణ్ షాకు సైన్యంతో చాలా అనుబంధం ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు, సంస్థలు, సైనిక మౌలిక సదుపాయాలు ఈయన పేరుతో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2024లో సిగ్దేల్ నేపాల్ సైన్యం బాధ్యతలు తీసుకునే సమయంలో కూడా ఆయన వెనక పృథ్వీ నారాయణ్ షా ఫోటో ఉంది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో రాచరికం రావాలని పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. మాజీ మావోయిస్టు గెరిల్లా దుర్గా ప్రసాయి రాచరికం రావాలని డిమాండ్ చేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande