న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.)తాను బెదిరించినా పట్టించుకోకుండా రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే (Trump Tariffs). కానీ, భారత్ మాత్రం రష్యా (India-Russia)తో ఉన్న తన చిరకాల స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఈ తరుణంలో రెండు దేశాలు ‘ఎక్సర్‌సైజ్ జాపడ్’ను నిర్వహిస్తున్నాయి.
ఈ రోజు (సెప్టెంబర్ 10) నుంచి 16 వరకు భారత్-రష్యా బలగాలు ఆపరేషన్ జాపడ్ పేరిట సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయి. సంప్రదాయ యుద్ధరీతులు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సరికొత్త వ్యూహాలను మార్పిడి చేసుకుంటాయని భారత రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం భారత సైన్యానికి (Indian Army) చెందిన 65 మందితో కూడిన బృందం మంగళవారం రష్యాకు వెళ్లింది. నిజ్నీ నగరంలోని ములినో ట్రైనింగ్ గ్రౌండ్‌లో ఈ విన్యాసాలు జరుగుతాయని తెలిపింది. వీటివల్ల ఇరుదేశాల (India-Russia) మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం అవుతాయని, స్నేహబంధం మరింత పటిష్టంగా మారుతుందని పేర్కొంది. పరస్పర సహకారం, విశ్వాసం మెరుగుపడుతుందని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ