న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.) కర్ణాటకలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో జరిగిన ఈద్ మిలాద్ వేడుకలు వివాదాలకు కేంద్రంగా మారాయి. రెచ్చగొట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వీటిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలో, తరికెరే రోడ్డులోని గాంధీ సర్కిల్ సమీపంలో జరిగిన ఉరేగింపులో యువకుల గుంపు ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేస్తున్న 12 సెకన్ల వీడియో వైరల్‌గా మారింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. డీజే మ్యూజిక్‌ని డ్యాన్స్ చేస్తుండగా ఈ నినాదాలు వినిపించాయి. ఈ ఘటనపై ఎప్ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఇదిలా ఉంటే, విజయపురలో సెప్టెంబర్ 05న జరిగిన ఈద్ మిలాద్ వేడుకల్లో రెచ్చగొట్టే ఆడియోను ప్లే చేసినందుకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడియో క్లిప్‌లో ‘‘15 నిమిషాల కే లియే పోలీస్ కో హటావో, బతే హై కౌన్ కిస్ మే దమ్ హై, హిందూస్తాన్ బనా దిఖైయే” (15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, ఎవరికి నిజమైన బలం ఉందో మేము చూపిస్తాము’’ అని చెప్పినట్లు తెలుస్తోం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ