లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ముంబయి,10, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాల్లో కొనసాగుతున్నాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ.. మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోత అంచనాలు ఉపకరిస్తున్నాయి. నిఫ్టీ
Life tax


ముంబయి,10, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాల్లో కొనసాగుతున్నాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ.. మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోత అంచనాలు ఉపకరిస్తున్నాయి. నిఫ్టీ 25వేల మార్క్‌కు చేరువైంది. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 381 పాయింట్లు పుంజుకొని 81,489 వద్ద ఉండగా.. నిఫ్టీ 118 పాయింట్లు ఎగబాకి, 24,987 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.13గా ఉంది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, జియో ఫైనాన్షియల్‌, టెక్‌ మహీంద్రా, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హీరో మోటార్‌కార్ప్‌, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ, హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేడు ఆసియా మార్కెట్లు అదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు, వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా స్వరంలో మార్పు కనిపిస్తోంది. అడ్డంకులను పరిష్కరించడానికి తాము ఇండియాతో చర్చలు కొనసాగిస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో భారత్‌, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని ఐరోపా దేశాలకు ట్రంప్ సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande