న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.): దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ (Jharkhand) రాంచీ నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది (ISIS Terrorist) అజార్ డానిష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జార్ఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) రాంచీ పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా అజార్ డానిష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి కొన్ని డిజిటల్ పరికరాలు, పాస్‌పోర్టులు, ఐడియాలజీకి సంబంధించిన డేటా వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ