ఆత్మహత్యల నివారణకు ఏఐ యాప్‌
న్యూఢిల్లీ,11,సెప్టెంబర్ (హి.స.) విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు దిల్లీ-ఎయిమ్స్‌ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్‌ను బుధవారం ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం నేపథ్యంలో ‘నెవర్‌ ఎలోన్‌’ పేరిట దీనిని ప్రారంభించింది. దీని సహాయంతో కళాశాల, యూనివర్సి
ఆత్మహత్యల నివారణకు ఏఐ యాప్‌


న్యూఢిల్లీ,11,సెప్టెంబర్ (హి.స.) విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు దిల్లీ-ఎయిమ్స్‌ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్‌ను బుధవారం ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం నేపథ్యంలో ‘నెవర్‌ ఎలోన్‌’ పేరిట దీనిని ప్రారంభించింది. దీని సహాయంతో కళాశాల, యూనివర్సిటీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తూ వారిలో ఆత్మహత్య ఆలోచనలను గుర్తించొచ్చని మానసిక విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ నందకుమార్‌ వెల్లడించారు. తద్వారా వారు బలవన్మరణానికి పాల్పడకుండా వారికి కౌన్సెలింగ్‌ ద్వారా జీవితంపై అనురక్తిని కలిగించవచ్చు. ఎయిమ్స్‌-భువనేశ్వర్, షాహ్‌దరాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (ఐహెచ్‌బీఏఎస్‌) కూడా ఈ యాప్‌ను ప్రారంభించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande