ముంబై, 11 సెప్టెంబర్ (హి.స.)మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అంతేకాకుండా 22 క్యారెట్ల గోల్డ్ రేట్స్ లక్ష దాటి రికార్డులకెక్కాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,01,300 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.1,01,310 ఉంది. అలాగే నిన్న రూ.1,10,509 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,40,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్ లో పసిడి ధర బుధవారం వలెనే గురువారం కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 1,10,519లకు చేరుకుంది. ఈరోజు గ్రాముకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 82,890లకు చేరుకుంది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరులో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,460గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,670 లుగా ఉంది.
ఈ రోజు వెండి ధర ఎలా ఉన్నదంటే.. బంగారం తర్వాత వెండి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. వెండిని ఆభరణాలు, నాణేలు వంటి వాటి తయారీ కోసమే కాదు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం సురక్షితం అని భావిస్తున్నారు. దీంతో వెండి ధరలు కూడా రెక్కలు వచ్చాయి. అల్ టైంకి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం ఎలా ఉందో తెలుసుకుందాం.. ఈ రోజు హైదరాబాద్ లో కేజీ వెండి ధర1,39,900 లకు చేరుకుంది. విజయవాడ, ప్రొద్దుటూరు, రాజమహేందరవరంలో ఇవే ధరలు ఉండగా.. దేశ రాజధాని డిల్లీ లో రూ.1,29,900లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి