దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి
ముంబయి,11, సెప్టెంబర్ (హి.స.). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల వేళ మన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్ల లాభ
Bombay Stock Exchange


ముంబయి,11, సెప్టెంబర్ (హి.స.). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల వేళ మన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 81,491 వద్ద ఉండగా.. నిఫ్టీ 9.3 పాయింట్ల లాభంతో 24,982 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.13 వద్ద ఉంది.

నిఫ్టీ సూచీలో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, జియో ఫైనాన్షియల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటార్‌ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌, టెక్‌ మహీంద్రా, ట్రెంట్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు అదే దారిలో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande