భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
న్యూఢిల్లీ,11,సెప్టెంబర్ (హి.స.) భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోడీ
U.S. President Donald Trump to lift sanctions imposed on Syria.


న్యూఢిల్లీ,11,సెప్టెంబర్ (హి.స.) భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోడీ తనకు చాలా మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనువెంటనే మోడీ కూడా రిప్లై ఇచ్చారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. రెండు దేశాల భాగస్వామ్యం చాలా గొప్పదిగా అభివర్ణించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ చర్చలు త్వరలోనే జరుగుతాయని అధికార వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈసారి చర్చలు జరిగితే ఢిల్లీలోనే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

x

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande