అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ..
ముంబయి,11, సెప్టెంబర్ (హి.స.) అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్
vote fraud nadapuram


ముంబయి,11, సెప్టెంబర్ (హి.స.) అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి ప్రాథమిక పనులు పూర్తవుతాయని, అక్టోబర్ లో ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది అధికారులు కమిషన్‌కు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా సవరణను నిర్వహించింది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సవరణ ప్రధాన లక్ష్యం మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతానికి మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, అక్రమ ఓటర్లను ఏరిపారేయడం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande